telugu navyamedia
ఆరోగ్యం

త‌రుచూ తలనొప్పి వేదిస్తుందా..? అయితే ఇలా ఉప‌శ‌మ‌నం పొందండి..

తలనొప్పి ప్రతి ఒక్కరిలో వచ్చే సాధారణ సమస్య అయిపోయింది. తలనొప్పికి కారణాలేవైనా కావచ్చు, దాని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. చాలా సందర్భాలలో తలనొప్పి కి గల కారణం తెలియక పోవచ్చు.

త‌ల‌నొప్పి ల‌క్ష‌ణాలు ..

తలలో కొట్టుకుంటున్నట్లుగా.. వస్తూ పోతున్నట్లుగా.. తగ్గుతూ, తీవ్రమవుతున్నట్టు ఉంటుంది. కొందరికి వాంతులవుతాయి, కొందరికి కావు. ఎవరన్నా మాట్లాడితే చికాకుగా ఉంటుంది. శబ్దాలు వినబుద్ధి కాదు, వెలుతురు చూడబుద్ధి కాదు. ప్రయాణం చేసినా, ఎండలో ఎక్కువగా తిరిగినా, భోజనం ఆలస్యమైనా లేక అస్సలు తినకపోయినా, నిద్ర తక్కువైనా లేక మరీ ఎక్కువైనా.. ఇలాంటి సందర్భాలన్నింటిలోనూ ఈ రకం తలనొప్పి రావచ్చు. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి , టెన్షన్ , నిద్రలేమి జన్యుపరమైన సమస్యలు ఇలా పలు కారణాలతో తలనొప్పి మనల్ని బాధిస్తుంది.

చాలా ఈ బాధ నుంచి బయటపడేందుకు మందులు వేసుకుంటారు. అయితే, పెయిన్ కిల్లర్లు ఎక్కువగా వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు..సాధారణంగా వచ్చే తలనొప్పుల నుంచి తక్షణం ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు పాటించ‌డం మంచింది.

Suffering from migraine? Here's what you should eat to reduce the pain - Times of India

త‌ల‌నొప్పి నుంచి త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం పొందే చిట్కాలు..

* ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే తలనొప్పి తగ్గుతుంది.
* గోరు వెచ్చని ఆవుపాలు సైతం తలనొప్పి నివారణిగా పనిచేస్తుందట.

* తలనొప్పిని తగ్గించడంలో యూకలిప్టస్ ఆయిల్ బాగా పనిచేస్తుంది.
* కొద్దిగా రాతి ఉప్పును చేర్చిన పాలను తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

13,056 Women Drinking Milk Stock Photos, Pictures & Royalty-Free Images - iStock
* మీ ఇంట్లో చందనం పౌడర్ ఉన్నట్లయితే.. పేస్టులా చేసుకుని తలకు రాసుకోండి.
* టీ లేదా మాంచి కాఫీని తాగడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
* అల్లాన్ని నమిలినా సరే తలనొప్పి తగ్గుతుంది.
* తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో.. కాంతి తక్కువగా ఉండే ప్రాంతంలో విశ్రాంతి తీసుకోండి.
* కొద్దిగా వెల్లులిని తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయండి. ఆ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు తలనొప్పి తగ్గుతుంది.

6 Benefits of Using Coconut Oil Daily
* తలనొప్పిని తగ్గించడంలో కొబ్బరి నూనె చాలాబాగా పనిచేస్తుంది. దీన్ని కాస్త నడి నెత్తి మీద వేసుకుని మర్దనా చేసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
* మటన్, వెన్న ఎక్కువగా తీసుకొనేవారికి తలనొప్పి ఎక్కువగా వస్తుందట.
* విటమిన్-C, D, B12, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకొవడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

Waking Up With a Headache? – Cleveland Clinic

*తలనొప్పిగా ఉన్నప్పుడు మసాలా ఫుడ్‌ను అస్సలు తీసుకోవద్దు.
* మంచి నిద్ర, వ్యాయమం తలనొప్పిని దరిచేరకుండా మిమ్మల్ని రక్షిస్తాయి.

Related posts