telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఓటమిలోను ప్రజలను మర్చిపోని శాసన సభ్యుడు

He is a lawmaker who does not forget people in defeat

ఎన్నికల్లో గెలుపోటములు సహజం . గెలిస్తే కాలరు ఎగరేయడం ,ఓడిపోతే ఇంట్లో ముసుగు తన్ని పడుకోవడం నిజమైన ప్రజానాయకులు చేసేపని కాదు .  సహజంగా ఎన్నికల్లో గెలిచినా తరువాత విజయోత్సవాలు , విందులు , వినోదాలు సహజం . ఓటేసిన ప్రజలను మాత్రం మర్చిపోతారు . రాజకీయ నాయకుల సహజ గుణం . అయితే  తాను ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల దగ్గరకు వెళ్లి అందరినీ పలకరించి తనకు ఓటువేసినా , వెయ్యక పోయినా కూడా ధన్యవాదాలు తెలిపాడు ఓ శాసన సభ్యుడు . 


అతని పేరు బోడె ప్రసాద్. . 
కృష్ణా జిల్లా పెనమలూరు శాసన సభకు తెలుగు దేశం పార్టీ తరుపున 2014 నుంచి 2019 వరకు ప్రాతినిధ్యం వహించాడు మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్ళీ తెలుగు దేశం పార్టీ తరుపున పెనమలూరు నుంచి పోటీ చేసి వై సి పి పార్టీ అభ్యర్థి కొలను పార్ధసారధి చేతిలో ఓడిపోయాడు . అయినా నిరాశతో ఇంట్లో వుండలేదు . ఓటమికి కుంగిపోలేదు .
తన మోటారు సైకిల్ పై వెళ్లి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపాడు . తనకి ఓటు వేసినా , వేయకపోయినా అందరికీ ధన్యవాదాలు చెప్పాడు . అంతేకాదు తాను తెలియక తప్పు చేస్తే క్షమించమని కూడా మహిళలలను అడుగుతున్నాడు . బోడె ప్రసాద్ చేసిన పనిని అందరు మెచ్చుకుంటున్నారు . నిజమైన ప్రజా నాయకుడు అంటే ప్రసాదే అంటున్నారు . 

Related posts