telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

మారుతి సుజుకీ .. హాచ్‌ బ్యాక్ ఎస్-ప్రెస్సో .. వచ్చేస్తోంది..

hatch back s-presso from maruti soon

ఈ నెల (సెప్టెంబర్) 30న దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ సరికొత్త హాచ్‌ బ్యాక్ ఎస్-ప్రెస్సో వాహనాన్ని లాంచ్ చేస్తోంది. ఈ మేరకు మారుతి కంపెనీ మీడియాకు ఆహ్వానాలు పంపుతోంది. ఇటీవల ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఎంట్రీ లెవల్‌ కారు గా దీన్ని ప్రదర్శించింది. నాలుగు వేరియంట్‌లలో ఈ కారును మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది.

మారుతి సుజుకి స్పోర్టీ లుక్‌లో వుస్తున్న ఎస్-ప్రెస్సో ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, పవర్ 68హెచ్‌పి, టార్క్ 90 ఎన్‌ఎమ్, మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. దీంతోపాటు సీఎన్‌జీ మోడల్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇక ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ .4 లక్షలు నిర్ణయించవచ్చని అంచనా.

Related posts