telugu navyamedia
telugu cinema news trending

ఇందూ కి జవానీ : ‘హసీనా పాగల్ దివాని..’ సాంగ్ రిలీజ్… రవితేజ సాంగ్ కాపీనా ?

Kiara

2014లో తొలిసారిగా కియారా అద్వానీ ‘ఫగలీ’ సినిమాతో బాలీవుడ్‌లో కాలు మోపారు. కానీ అక్కడ సరైన హిట్ ను అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ “కబీర్ సింగ్” చిత్రంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది కియారా అద్వానీ. ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా “లక్ష్మీ బాంబ్”లో నటించిన కియారా… ప్రస్తుతం “ఇందూ కి జవానీ”, “భూల్ భూలయ్య-2″లో నటిస్తోంది. వీటిలో “ఇందూ కి జవానీ” సినిమా షూటింగ్ ను ముగించుకుంది. ఇక ఈ సినిమా త్వరలో ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నారు. అబీర్ సేన్ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఇందూ కి జవానీ’ డేటింగ్ నేపథ్యంలో సినిమా. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను బుధవారం రోజున చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘హసీనా పాగల్ దివాని..’ అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్‌లో కైరాతో పాటు ఆదిత్య సియల్‌ కన్పించారు. ఈ సాంగ్‌ రవితేజ హీరోగా పూరి తెరకెక్కించిన ‘ఇడియట్‌’ సినిమాలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి…’ ట్యూన్‌ను పోలి ఉండడం గమనార్హం. దీంతో నెటిజన్లు ఈ సాంగ్ పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

వైఎస్ఆర్ అక్షయ పాత్రగా … మధ్యాహ్నభోజన పథకం..కార్మికుల గౌరవవేతనం 3వేలు..

vimala p

రేయ్ రామ్ గోపాల్ వర్మ… సిగ్గులేనోడా… వర్మపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

vimala p

మహేష్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్

vimala p