telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎవరు ఓడిపోయారో… కానీ సినిమా గెలిచింది : హరీష్ శంకర్

Valmiki

“గ‌బ్బ‌ర్ సింగ్”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హరీష్ శంకర్ ఆ త‌ర్వాత మ‌రో విజ‌యాన్ని అందుకోలేకపోయారు. చాలాకాలం తరువాత మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో గద్దలకొండ గణేష్” చిత్రంతో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న హ‌రీష్ స‌క్సెస్ సాధించాడు. వాల్మీకి అనే టైటిల్‌తో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 20న విడుద‌లైంది. అయితే “వాల్మీకి” టైటిల్‌ అభ్యంతరకరంగా ఉందని బోయ సామాజిక వర్గానికి చెందిన బోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై తమకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో చివ‌రి క్ష‌ణంలో “వాల్మీకి” అనే చిత్ర టైటిల్‌ని “గ‌ద్ద‌లకొండ గ‌ణేష్” అని మార్చారు. అప్ప‌టి వ‌ర‌కు వాల్మీకిగా ప్ర‌చారం జ‌రుపుకున్న చిత్ర టైటిల్ రిలీజ్‌కి ముందు రోజు మారడంతో చిత్ర యూనిట్ తెగ ఆందోళ‌న చెందారు. సినిమా క‌లెక్ష‌న్స్‌కి ఏమైన ఎఫెక్ట్ ప‌డుతుందా అని ఆలోచ‌న చేశారు. కాని సినిమాకి వ‌స్తున్న టాక్ చూసి మేక‌ర్స్ చాలా సంతోషించారు. ఈ సందర్భంగా హ‌రీష్ స్పందిస్తూ “సినిమా చూసిన వారితో పాటు మ‌మ్మ‌ల్ని స‌పోర్ట్ చేసి ప్ర‌తి ఒక్క‌రికి ధన్యవాదాలు. అలానే ప్రింట్ మీడియా, వెబ్ మీడియా, ఎల‌క్ట్రానిక్ మీడియా ఇచ్చిన విలువైన రివ్యూస్ మాకు చాలా ప్రేర‌ణ ఇచ్చాయి అని హ‌రీష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. మాకు జరిగిన ఇబ్బంది కలగకపోయి ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్‌ చేసేవాళ్ళం. మా సినిమాకి ఇంత ప్రేమ వస్తుంది అని మేము అనుకోలేదు. ఎవరు ఓడిపోయారో నాకు తెలీదు కానీ సినిమా మాత్రం గెలిచింది” అని ప్రెస్‌మీట్‌లో స్ప‌ష్టం చేశారు ద‌ర్శ‌కుడు హ‌రీష్.

Related posts