telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళితే చాలు…” వలస కూలీలపై హరీష్ శంకర్ ట్వీట్

Harish-Shankar

లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. రోజూవారీ కూలీలు ఈ లాక్ డౌన్ తో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వలస కూలీల బాధలు చెప్పనలవి కాదు. బస్సులు, రైళ్ళు లేకపోవడం, ఉన్నా వాటికి చార్జీలు పెట్టుకునే స్థోమత లేకపోవడంతో కాలినడకనే సొంత ఊళ్లకు బయలుదేరారు. ఆకలి కేకలను సైతం పట్టించుకోకుండా నడక సాగించిన వలసకూలీలకు సాయం అందించేందు. వారికీ ఆహారం అందించేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. తాజాగా యువ దర్శకుడు హరీష్ శంకర్ వారి వేదనను ట్విట్టర్ ద్వారా తెలిపారు. “బండరాళ్లని పిండి చేసిన చేతులు ఎడమపక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి. పెద్ద పెద్ద ఇనుప చువ్వలని వంచిన వేళ్ళు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి. మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళితే చాలనుకుంటూ.. ఆకలి అడుగులతో.. పేగలు అరుపులతో.. కాళ్లు, కడుపు ఒకేసారి కాలుతుంటే ..మమ్మల్ని చూసే లోకులకి బాధేస్తోంది.. జాలేస్తోంది.. కానీ మాకు మాత్రం ఆకలేస్తోంది” అంటూ మనసును కదిలించేలా రాసారు.

Related posts