telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే : హరీష్ శంకర్

harish

వరుణ్ తేజ్‌ కథానాయకుడిగా `గద్దలకొండ గణేష్` సినిమా తో హిట్ కొట్టిన డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం తన తర్వాతి సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. గతంలో పవన్ కళ్యాణ్‌కి ‘గబ్బర్ సింగ్’ రూపంలో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు హరీష్ శంకర్. దీంతో పవన్ రీ ఎంట్రీ మొదట్లోనే హరీష్- పవన్ సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్ కాబోతోందని వార్తలు షికారు చేశాయి. ఇదే విషయమై తాజా ఇంటర్వ్యూలో స్పందించిన హరీష్ తానెప్పుడూ ఓ డైరెక్టర్‌ స్టేజ్‌లో పవన్ కళ్యాణ్‌ని చూడనని, ఓ ఫ్యాన్‌గా మాత్రమే చూస్తానని చెప్పారు. తాను చేసే ప్రాజెక్ట్ పవర్ స్టార్ అభిమానులు కోరుకునే విధంగా ఉంటుందని, అది చూసి పవన్ అభిమానులు ఆయనను మరింతగా ఆరాధిస్తారని చెప్పారు హరీష్. ప్రస్తుతం తాను ఓ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నానని వెల్లడించారు. నిర్మాతలు మహేష్ ఎస్ కొనేరు, బన్నీ వాస్‌ల సహకారంతో త్వరలో సినిమాలు నిర్మించడం ప్రారంభిస్తానని అన్నారు. అలాగే మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ఓ స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నానని చెప్పారు. దీనిబట్టి చూస్తే తన తదుపరి మూవీ పవన్‌తో కాదు మహేష్ బాబుతో ఉంటుందని హింట్ ఇచ్చారు హరీష్ శంకర్.

Related posts