హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా జిగర్తాండకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమాలో తమిళ్ హీరో అథర్వ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్. దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. తనకున్న ప్రాబ్లమ్స్ గురించి, ట్రాఫిక్ గురించి.. ఇలా ప్రతి విషయంపై ట్వీట్స్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి ఫొటో ఒకటి షేర్ చేసి.. ఈ ఫొటో షేర్ చేయకుండా ఉండలేకపోతున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి సూపర్బ్ లుక్‌లో ఉన్నారు. యంగ్ లుక్‌లో ఉన్న చిరు ఫొటోని పోస్ట్ చేయడమే కాకుండా దర్శకుడు కొరటాల శివపై జెలసీగా ఉందని అన్నారు. ఎందుకంటే కొరటాల శివ తదుపరి చిత్రం చిరంజీవితోనే చేయబోతున్నారు. ఆయన సినిమా కోసమే చిరు ఇలా యంగ్ లుక్‌లోకి మారారు. ‘‘ఈ పిక్‌ని పోస్ట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. మొదటిసారి నా స్నేహితుడు కొరటాల శివపై జెలసీగా ఉంది. వీరు ఎలాంటి సినిమా చేయబోతున్నారో అని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది’’ అంటూ హరీష్ తన ట్వీట్‌లో తెలిపారు.
Can’t resist to post this..pic for the first time am jealous of my friend @sivakoratala 🙈🙈And waiting for the entire universe to conspire !! pic.twitter.com/gbzgPKqJ55
— Harish Shankar .S (@harish2you) 11 August 2019
“కార్తీక దీపం” సీరియల్ పై దర్శకుడి వెదవ కామెంట్స్… !?