telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నిరాశపరుస్తున్నందుకు మన్నించండి.. ట్విటర్‌లో తెలిపిన హరీశ్‌రావు

మాజీ మంత్రి హరీశ్‌రావు తన అభిమానులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను మన్నించాలని కోరారు. జూన్‌ 3వ తేదీన పుట్టిన రోజు జరుపుకోనున్న హరీశ్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. సోమవారం రోజున తాను సిద్ధిపేటలో కానీ, హైదరాబాద్‌లో కానీ ఉండటం లేదని తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వస్తామనుకున్నవారిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాల్సిందిగా ట్విటర్‌లో పేర్కొన్నారు.

నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలి. జూన్ 3న నేను హైదరాబాద్‌లో కానీ, సిద్ధిపేటలో కానీ ఉండడంలేదు. ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోంది. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నానని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

Related posts