telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి: హరీష్‌ రావు

harish rao trs

విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు. పటాన్‌చెరు టౌన్‌లో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(బాలికలు) భవనాన్ని మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులు, ర్యాంకులతో పాటు నైతిక విలువలు కూడా ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.

పదో తరగతిలో వచ్చిన ఫలితాల మాదిరిగానే ఇంటర్‌, డిగ్రీలో వందకు వంద శాతం ఫలితాలు రావాలన్నారు. విద్యార్థుల దశ, దిశ మార్చేది ఇంటర్‌, డిగ్రీ మాత్రమే అని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. పిల్లల్లో చదువులతో పాటు నైతిక విలువలు పెంపొందించాలి. సంప్రదాయాలు నేర్పించి, సామాజిక స్పృహను పెంచాలని హరీష్‌ రావు సూచించారు.

Related posts