telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

తెలంగాణలో మరో ముప్పై ఏళ్లు టీఆర్‌ఎస్సే: హరీష్

Ryathu bandhu amount Rs. 10000 in future
తెలంగాణ లో మరో ముప్పై ఏళ్లు టీఆర్‌ఎస్సే అధికారంలో ఉంటుదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కి భవిష్యత్ లేదనే స్పష్టత అందరికీ వచ్చిందన్నారు.  టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధిని సాధించి దేశానికే ఆదర్శమైందన్నారు. మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ మిషన్ కాకతీయ, రైతుబంధు, మిషన్ భగీరథ లాంటి పథకాలు దేశానికే ఆదర్శమయ్యాయని తెలిపారు.
 కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందని ఓట్లను ఏరుకుంటోందని ఎద్దేవా చేశారు. ఏం చేసినా కూడా కాంగ్రెస్, బీజేపీలు గెలిచే పరిస్థితిలో లేవని విమర్శించారు. తమకు పోటీ ఎవరూ లేరని, టీఆర్‌ఎస్‌కి టీఆర్‌ఎస్సే పోటీ అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ సభలకు జనాలు లేక  సభలు వెలవెల బోతున్నాయని విమర్శించారు. తెలంగాణ సభల్లో తెలంగాణ గురించి రాహుల్ ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ తరపున  మోదీ వచ్చి ప్రచారం చేసినా 103 సీట్లలో డిపాజిట్లు కోల్పయిందన్నారు.

Related posts