telugu navyamedia
సామాజిక

మాదకద్రవ్యాలు నిషేధం ఉండదు.. నేను గంజాయి తాగాను అంటున్న కమలా హారిస్ 

Kamala hariss on drugs prohibition
అమెరికాలో క్రమంగా ఎన్నికల వేడి, బరిలో ఉన్న అమెరికన్ ఎన్నారై మహిళ కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ తరఫున ఈసారి ప్రెసిడెంట్ కుర్చీ కోసం పోటీ పడుతోంది. 2017 నుంచి కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్న హారిస్.. ఈసారి బిగ్గర్ ప్రమోషన్‌కి ప్రయత్నిస్తోంది. తనకు అధికారమిస్తే ఏమేం చేస్తానో చెపుతూ ప్రచారంలో దూసుకుపోతోంది. ఇదే క్రమంలో ‘న్యూయార్క్ సిటీ’ రేడియో షోలో ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
‘ది బ్రేక్‌ఫాస్ట్ క్లబ్’ అనే ఈ కార్యక్రమంలో.. ‘మాదకద్రవ్యాల చట్టబద్ధీకరణను మీరు వ్యతిరేకిస్తారట కదా’ అని హోస్ట్ అడిగితే.. ‘అది పచ్చి అబద్ధం’ అంటూ కొట్టిపారేసింది కమలా హారిస్. ‘మా కుటుంబంలో సగానికి సగం మంది జమైకన్లు.. నేనెందుకలా చేస్తాను’ అని ఎదురుప్రశ్నించింది. “మత్తు అనేది చాలామందికి ఎంజాయ్‌మెంట్ ఇస్తుంది. మనకు ఈ ప్రపంచం నుంచి వీలైనంత ఎక్కువ సంతోషాన్నే కదా కోరుకుంటాం” అంటూ స్పష్టతనిచ్చింది. కాలేజ్ రోజుల్లో తాను జాయింట్ (గంజాయి)ని స్మోక్ చేశానని ఒప్పుకుంది కూడా. 1992 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌లో బిల్ క్లింటన్ కూడా ఇటువంటి కామెంటే చేశారు.
నిజానికి.. కమలా హారిస్ గతంలో ‘డ్రగ్ లీగలైజేషన్’ ప్రతిపాదనని తీవ్రంగా వ్యతిరేకించేవారు. 2010లో శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఉన్నప్పుడు డ్రగ్‌ని లీగలైజ్ చేయడాన్ని అడ్డుకున్నారు. cannabis అనే మరో మాదకద్రవ్యం వాడకాన్ని 62 శాతం మందికి పైగా అమెరికన్లు సపోర్ట్ చేస్తున్నట్లు Pew Research Center నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేయకపోతే అమెరికన్లు ఓట్లెయ్యరన్న ఆందోళన కమలా హారిస్‌ని ఇలా ‘నిజం’ చెప్పేలా చేసింది.

Related posts