telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హార్థిక్ పటేల్ మిస్… పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

HArthik

కాంగ్రెస్ లీడర్ హార్థిక్ పటేల్ మిస్ అయ్యాడు. జనవరి-24నుంచి హార్థిక్ పటేల్ కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజాల్ సోమవారం పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చింది. జనవరి-18,2020న హార్థిక్ ను పోలీసులు అరెస్ట్ చేయగా జైలు నుంచి జనవరి-24న హార్థిక్ విడుదలయ్యాడు. జనవరి-24 జైలు నుంచి విడుదలైన అనంతరం హార్థిక్ ఓ ట్వీట్ చేశాడని…అందులో నియంతృత్వ నిర్భంధం నుంచి విడుదలయ్యాను. కానీ నా తప్పు ఏంది అంటూ హార్థిక్ ఆ ట్వీట్ లో తెలిపాడని కింజల్ తెలిపారు. తన విడుదల గురించి చెప్పినప్పటికీ…అప్పటినుంచి హార్థిక్ ఇంటికి ఫోన్ చేయలేదని,కుటుంబసభ్యులతో ఎలాంటి కాంటాక్ట్ లేదని కింజల్ తెలిపారు. హార్థిక్ అదృశ్యం వెనుక ప్రభుత్వ యంత్రాంగం హస్తం ఉందని,తమ కుటుంబాన్ని ప్రభుత్వం కొన్నాళ్లుగా వేధిస్తుందని కింజల్ తెలిపారు. చాలా కేసుల్లో తన భర్త అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాడని, చాలా సందర్భంగా వెంటనే బైలుపై బయటకి వచ్చాడని, వేరే ఇతర కేసులో హార్థిక్ ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారని, దీన్ని వేధింపులు అనక ఇంకేమంటారు అని కింజల్ తెలిపారు. తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడుపడితే అప్పుడు పోలీసులు మా ఇంటికి వస్తున్నారు అంటూ కింజల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కింజల్ ఆరోపణలను గుజరాత్ డీజీపీ శివానంద్ జా తోసిపుచ్చారు. హార్థిక్ పటేల్ జైలు నుంచి విడుదలైనప్పటినుంచి అతడి గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని పటీదార్ అనామత్ ఆందోళన్ వర్గాలు తెలిపాయి. హార్థిక్ అండర్ గ్రౌండ్ కు వెళ్లాడా లేదా అన్నది ఎవ్వరికీ తెలియదని చెప్పారు. మరోవైపు హార్థిక్ పై గుజరాత్ పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అతడిని వేధిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

Related posts