telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

వ్యక్తిగత కారణాల వల్ల తాను ఐపీఎల్ ఆడలేను: హర్భజన్

haribjan singh spinner

చెన్నై సూపర్ కింగ్స్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే స్టార్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోక ముందే ఆ ఫ్రాంచైజీకి టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో షాక్ ఇచ్చాడు. ఈ ఐపీఎల్ లో తాను ఆడబోవడం లేదని సీఎస్కే యాజమాన్యానికి తెలిపాడు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ సీజన్ లో ఆడటం లేదని వెల్లడించాడు.

సీఎస్కే జట్టు సభ్యులందరూ ఇప్పటికే యూఏఈకి వెళ్లారు. భజ్జీ మాత్రం ఇండియాలోనే ఉండిపోయాడు. ఈ అంశంపై చర్చ జరుగుతుండగానే… భజ్జీ తాను ఆడలేనని ప్రకటించాడు. ఇప్పటికే సీఎస్కే జట్టును కరోనా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్లు దూరం కావడంతో ఆ జట్టుకు కొంత ఇబ్బందికర పరిస్తితి తలెత్తే అవకాశముంది.

Related posts