telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంతకంటే నాకింకేం కావాలి… నమ్రత ఎమోషనల్ పోస్ట్

Mahesh

టాలీవుడ్‌‌లోని అన్యోన్యమైన జంటల్లో మహేష్‌, నమ్రత జంట ఒకటి. ఈరోజు వారి వివాహ వార్షికోత్సవం (ఫిబ్రవరి 10). 2005 ఫిబ్రవరి 10న మహేష్‌తో కలిసి నమ్రత ఏడడుగులేశారు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మహేష్ ‘‘Happy 15 my love.. Love you a little more each day Namrata’’ అంటూ లవ్ సింబల్స్‌తో ట్వీట్ చేయగా.. దానికి బదులుగా నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. “ప్రతి అమ్మాయి కోరుకునే అద్భుతమైన జీవితాన్ని నువ్వు నాకు అందించావు. షరతులేని ప్రేమతో, ముద్దులొలికే ఇద్దరు చిన్నారులతో నందనవనంలాంటి ఇంటిని ఇచ్చావు. వీటన్నింటినీ మించి నీ స్నేహం నాకు దొరికిన గొప్ప నిధి. ఇంతకంటే నాకింకేం కావాలి. నా ప్రియమైన మహేశ్‌కు 15వ పెళ్లిరోజు శుభాకాంక్షలు” అంటూ నమ్రత ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Related posts