telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వ్యాపార వార్తలు

హ్యాపీ మొబైల్స్‌ .. వార్షికోత్సవం.. మరో 200 స్టోర్లు ..తెలుగు రాష్ట్రాలలో.. భారీ ఆఫర్లు..

happy mobiles first anniversary offers

తెలుగు రాష్ట్రాలలో హ్యాపీ మొబైల్స్‌ తన ఏడాది వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 50 స్టోర్లతో 5 లక్షల మందికిపైగా కస్టమర్లకు చేరువైంది. ఈ విజయంతో ఆగిపోకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 150- 200 ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌ వెల్లడించారు.తొలి స్టోర్‌ను ఆరంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా కంపెనీ ఈడీ కోట సంతోష్‌తో కలసి తన ఏడాది ప్రయాణాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. 2018-19లో రూ.250 కోట్ల పైచిలుకు టర్నోవర్‌ సాధించామని, 2019-20లో రూ.500 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నామని మీడియాతో తెలిపారు. ప్రస్తుతం 600 మంది ఉద్యోగులుండగా సిబ్బంది సంఖ్య 2,000 దాకా విస్తరిస్తామని తెలిపారు.

కస్టమర్ల కోసం హ్యాపీడేస్‌ పేరు తో హ్యాపీ మొబైల్స్‌ కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువచ్చింది. పలు రకాల కంపెనీ ఫోన్లపై ఆఫర్లను డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ నెల 30 వరకు ఆఫర్లుంటాయి. ప్రతి మూడు నెలలకు హ్యాపీ డేస్‌ ఆఫర్లను పరిచయం చేస్తామని కోట సంతోష్‌ చెప్పారు. ఇందులో భాగంగా హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ద్వారా ఫోను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌, పేటీఎంపై 40 శాతం ఆదా, ప్రైస్‌ డ్రాప్‌ ప్రొటెక్షన్‌, వన్‌టైమ్‌ స్ర్కీన్‌ రీప్లేస్మెంట్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు, ఈఎంఐ తదితర సదుపాయాలు కల్పిస్తోంది. అంతేకాకుండా ఫోన్ల కొనుగోలుపై మైక్రోమాక్స్‌ ఎల్‌ఈడీ టీవీ, క్రాంప్టన్‌ కూలర్స్‌, మిక్సర్లు వంటివాటిని బహుమతులుగా అందిస్తోంది. హ్యాపీ మొబైల్స్‌ ఒక్కో స్టోర్‌కు రూ.40-50 లక్షలు వెచ్చిస్తోంది. కొన్ని స్టోర్లలో ఎల్‌ఈడీ టీవీలు, వాక్యూమ్‌ క్లీనర్లు, సీసీ కెమెరాల వంటి లైఫ్‌స్టైల్‌ ప్రొడక్టులను విక్రయిస్తోంది. దశలవారీగా అన్ని స్టోర్లలో వీటిని అందుబాటులో ఉంచనుంది.

happy mobiles first anniversary offersఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరిస్తాం. వచ్చే ఏడాది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర మార్కెట్లలో అడుగు పెట్టనుంది. హ్యాపీ స్టోర్‌ ఉన్న చోట కస్టమర్లు ఆన్‌లైన్లో ఆర్డరిస్తే గంటలో ఫోన్‌ను డెలివరీ చేస్తామని, త్వరలోనే ఈ సేవలను ప్రారంభిస్తున్నామని వివరించారు. లక్షన్నర జనాభా ఉన్న పట్టణాల్లో ఔట్‌లెట్‌ను తెరుస్తున్నట్లు కృష్ణ పవన్‌ వెల్లడించారు. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో 150 నుంచి 200 స్టోర్ల ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు హ్యాపీ మొబైల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కృష్ణ పవన్‌ తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ర్టాల్లో 46 స్టోర్లున్నాయని పేర్కొన్నారు. కొత్త స్టోర్లతో రూ.500 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా చేసుకున్నామన్నారు.

Related posts