telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు… కొత్త సినిమా ప్రకటన

BEllamkonda-Srinivas

బెల్లంకొండ శ్రీనివాస్ “అల్లుడు శీను” చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన శ్రీనివాస్ కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి కెరీర్ మొదట్నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇటీవల “కవచం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కాజల్, మెహ్రీన్ ల గ్లామర్ కూడా సినిమాను కాపాడలేకపోయింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సీత” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కూడా కాజల్ తోనే జతకడుతున్నాడు ఈ యువహీరో. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.

ఈరోజు బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించబోయే కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కోనేరు సత్యనారాయణ, కోనేరు హవీష్ లక్ష్మణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్ లో కన్పించనున్నాడని అంటున్నారు. హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా అయినా బెల్లంకొండ శ్రీనివాస్ కు మంచి హిట్ ఇవ్వాలని కోరుకుందాం.

Related posts