telugu navyamedia
telugu cinema news

మనిషేమో విలన్  మనసేమో హీరో … ఆయనే మోహన్ బాబు

Happy Birthday Collection King Mohan Babu Garu
నాలుగున్నర దశాబ్దాల విలక్షణ నటుడు పద్మశ్రీ మంచు మోహన్ బాబు మంచు మోహన్ బాబు పుట్టిన రోజు . వ్యక్తిగా మోహన్ బాబు 69వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు . నటుడుగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు .మంచు లక్ష్మి , మంచు విష్ణు , మంచు మనోజ్  ముగ్గురు నట జీవితాన్నే ఎంచుకున్నారు . నటుడుగా , నిర్మాతగా , దర్శకుడుగా , విద్యాదాతగా , రాజకీయ  నాయకుడుగా  మోహన్ బాబు బహుముఖాలుగా ఎదిగారు . సినిమా రంగంలో ఢక్కామొక్కీలు తిన్నారు . కాస్త నష్టాలు అనుభవించాడు . అయినా ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కు తిరిగి చూసుకోలేదు . 
Happy Birthday Collection King Mohan Babu Garu
రాయలసీమ పౌరుషం , తండ్రి ఉపాధ్యాయుడు గా నేర్పిన క్రమశిక్షణ , సినిమా రంగం లోని  అంకిత భావం అన్నీ కలిపి  మోహన్ బాబును రాటుతేలేలా చేశాయి . చిన్నప్పటి నుంచి మోహన్ బాబుకు నటన అంటే ఎంతో ఇష్టం . నాటకాల్లో నటించేవాడు . తండ్రి కి ఇష్టం ఉండేది కాదు . చందువుకొమ్మని చెప్పేవాడు . అయినా మోహన్ బాబు తండ్రి కన్ను పప్పి నటిస్తూ ఉండేవాడు . తండ్రి  చూసినప్పుడు  దండిస్తూ ఉండేవాడు . చదువు అయిపోయాక తండ్రి కోరిక మీద డ్రిల్లు మాస్టారుగా చేరినా ఆయన దృష్టి అంతా సినిమా రంగం మీదే ఉండేది . 
గంపెడంత ఆశతో , గగనమంత  ఆశయంతో మద్రాస్ వెళ్ళాడు . 
Happy Birthday Collection King Mohan Babu Garu
తెలిసిన వాళ్ళు లేరు . వేషాలు ఇస్తామన్నవారు లేరు . సినిమాల్లో ప్రోత్సహించేవారు లేరు , ఆర్ధికంగా ఆదుకునేవారు లేరు. కస్టాలు , కన్నీళ్లతో గడిపాడు . అయినా ఎదో ఆశ , భవిష్యత్తు మీద  అచంచలమైన నమ్మకం . మోహన్ బాబు కృషి ఫలించింది . ఎడారిలో ఒయాసిస్సులా ఊతం దొరికింది  1974లో “కన్నవారి కలలు ” ,”అల్లూరి సీతారామరాజు ” సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించడానికి అవకాశం వచ్చిందిఅదేసమయంలో దేవుడు  దాసరి  దాసరినారాయణ రావు రూపంలో సాక్షాత్కరించాడు . 1975లో దాసరి దర్శకత్వం వహించిన “స్వర్గం నరకం “. చిత్రంలో రాజేష్ పాత్రకు మోహన్ బాబును ఎంపిక చేశాడు . 
ఈ సినిమా లో మోహన్ బాబుది  ప్రతి నాయకుడు  పాత్ర . అయితేనేం మంచి గుర్తింపు తీసుకవచ్చింది ఆ తరువాత ఓ మనిషి తిరిగి చూడు , అత్తవారిల్లు , భలే దొంగలు  చిత్రాల్లో నటించడానికి అవకాశం వచ్చింది . అక్కడ నుంచి పెద్ద హీరోలతో విలన్ పాత్రలు పోషించాడు . విలనిజంలో సరికొత్త ట్రెండ్ తీసుకువచ్చాడు . తనకంటూ ఓ స్వంత సంస్థ ఉండాలనే ఆలోచన వచ్చింది . 1982లో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సంస్థను ప్రారంభించి “ప్రతిజ్ఞ ” అన్న చిత్రాన్ని నిర్మించాడు . అక్కడ నుంచి మోహన్ బాబు హీరోగా నటించడం మొదలు పెట్టాడు ,  అసెంబ్లీ రౌడీ , అల్లుడు గారు ,అల్లరి మొగుడు , పెద రాయుడు సినిమాలు సినిమాలు మోహన్ బాబును నిలబెట్టడమే కాకుండా మంచి పేరు తెచ్చిపెట్టాయి . 
Happy Birthday Collection King Mohan Babu Garu
1993లో అన్న రామారావు గారితో “మేజర్ చంద్ర కాంత” చిత్రాన్ని నిర్మించాడు .  ఆపరిచయమతో 1995లో రామారావు గారు మోహన్ బాబును రాజ్య సభకు ఎంపిక చేశారు . మోహన్ బాబు లక్ష్మి ప్రసన్న సంస్థ ద్వారా 80 చిత్రాల వరకు నిర్మించారు . మహానటిలో ఆయన ఎస్ వీ .రంగారావు పాత్రలో నటించాడు . ఇది మోహన్ బాబు 575 చిత్రం . తన రూట్స్  మర్చిపోకుండా 1992లో శ్రీ విద్యా నికేతన్ పేరుతో తిరుపతిలో విద్యా సంస్థను ప్రారంభించారు . ఇది ఆంధ్ర రాష్ట్రంలో పేరున్న సంస్థ . మొదట  డ్రిల్లు మాస్టర్ గా జీవితాన్ని ప్రారంభించిన మోహన్ బాబు విద్య ప్రాధాన్యత గుర్తించి  ఇంత పెద్ద విద్యా సంస్థను మొదలు పెట్టడం ఆయన లక్ష్యాన్నీ , లక్షాణాన్ని తెలియ జేస్తుంది . 
మోహన్ బాబు కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 2007లో పద్మశ్రీ  అవార్డుతో గౌరవించింది . 
Actor mohan babu house robbery Hyd-Babu
మోహన్ బాబుకు ముక్కు మీదనే కోపం అంటారు . అది నిజమే . క్రమ శిక్షణకు అలవాటుపడ్డ మోహన్ బాబు సాటి నటులు మయానికి రాకపోతే ఆగ్రహం వ్యక్త చేస్తాడు , ఒక్కో సందర్భంలో చేయికూడా చేసుకున్న ఘటనలు వున్నాయి . అది పుట్టుకతో వచ్చింది అంటూ ఉంటాడు . ఏమైనా మోహన్ బాబు తెలుగు సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో ను, విద్యా రంగంలోనూ  తన ఉనికిని చాటుకున్నాడు , ఎప్పటికీ తన ముద్రను వేసుకున్నాడు . 
mohanbabu fires on ap govt for reimbursement
విలక్షణ నటుడు, కలెక్షన్  కింగ్ , పద్మశ్రీ మోహన్ బాబు 19 మార్చి 1950న నారాయణ స్వామి నాయుడు , లక్ష్మమ్మ దంపతులకు చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నది ఒడ్డున వున్నమోదుగులపాలెం  గ్రామంలో జన్మించాడు . మోహన్ బాబు పేరు భక్తవత్సలం నాయుడు . సినిమాల్లోని వచ్చాక మోహన్ బాబు అని మార్చుకున్నాడు. ఏడు పదుల మోహన్ బాబుకు నవ్యమీడియా  జన్మదిన శుభాకాంక్షలు .
– భగీరథ 

Related posts

కండిషన్స్ అప్లై అంటున్న విజయ్ సేతుపతి ?

vimala p

“సాహో” సినిమాపై బాలీవుడ్ విమర్శకుల వైఖరి… ఫైర్ అవుతున్న నెటిజన్లు

vimala p

దర్శకుడు శ్రీవాస్ ఇంట విషాదం

vimala p