telugu navyamedia
telugu cinema news

విక్రమ్ పుట్టినరోజు… గిఫ్ట్ గా మేకింగ్ వీడియో

vikram

విభిన్నమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించడానికే విక్రమ్ ప్రాధాన్యతనిస్తారు. ఆయన తాజా చిత్రం “కడరమ్ కొండన్”లోను ఆయన కొత్త లుక్ తో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ హైలైట్ అని అంటున్నారు. కమల్ హాసన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు రాజేశ్ ఎం.సెల్వ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు విక్రమ్ పుట్టినరోజు… 53వ వసంతంలోకి ఆయన అడుగు పెట్టిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. విక్రమ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శకుడు రాజేశ్ ఎం.సెల్వ ఈ మేకింగ్ వీడియోను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో విక్రమ్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో పూజా కుమార్, అక్షర హాసన్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Related posts

వై.ఎస్.ఆర్ బయోపిక్ లో .. ఎమ్మెల్యేగా ప్రముఖ యాంకర్…

vimala p

కరీంనగర్‌ లో కరాటే పోటీలు..హాజరు కానున్న సినీనటుడు సుమన్

ashok

ఏప్రిల్ 19 న ప్ర‌పంచ‌వాప్తంగా విడుద‌ల‌కానున్న రాఘ‌వ లారెన్స్  మాసివ్ పెర్ఫార్మెన్స్ “కాంచ‌న‌-3”

ashok