telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తెనాలి రామకృష్ణ-బీఏబిఎల్ తో .. హన్సిక..

hansika and sandeep as tenali rakakrishna movie

హాస్యానికి సినిమా పరిశ్రమలో పెద్దపీటే ఉంది. పెద్ద హీరోలు కూడా కామెడీ చేసుకుపోతున్నారు కూడా. అలాంటిది ఒక చిత్రంలో మొత్తం హాస్య ప్రధానమైన కధాంశంతో తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డి సిద్ధహస్తుడు. ‘సీమశాస్త్రి’ .. ‘సీమ టపాకాయ్’.. ‘దేనికైనా రెడీ’.. ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాలు కామెడీ డ్రామాపై ఆయనకి గల పట్టును ఆవిష్కరిస్తాయి. అలాంటి నాగేశ్వరరెడ్డి మరో హాస్యరసభరిత చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగంలోకి దిగాడు. ఆ సినిమా పేరే ‘తెనాలి రామకృష్ణ .. బీఏబీఎల్’.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలుగా సందీప్ కిషన్, హన్సిక లను ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజునే మొదలైంది. మొదటి షెడ్యూల్ ను ‘కర్నూల్’లో ప్లాన్ చేశారు. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగు జరగనుంది. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సందీప్ కిషన్, ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా ‘గౌతమ్ నంద’ తరువాత హన్సిక చేస్తోన్న సినిమా ఇదే.

Related posts