telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అవిభక్త కవలలకు ప్రాణం పోసిన .. హంగేరీ డాక్టర్లు ..

hangeri doctors operation success

శరీరాలు అతుక్కుని జన్మించిన వీణా-వాణి లను విడదీయడం డాక్టర్ల శక్తికి మించిన పనైంది. బంగ్లాదేశ్ లో తలలు అతుక్కుపోయిన జన్మించిన ఇద్దరు అవిభక్త కవలలను హంగేరీ డాక్టర్లు విజయవంతంగా విడదీశారు. బంగ్లాదేశ్ కు చెందిన రబేయా, రుఖయా మూడేళ్ల వయసున్న కవలలు. 5 నుంచి 6 మిలియన్లలో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన ఎంబ్రియోలాజికల్ లోపంతో బంగ్లా కవలలు జన్మించారు. వీరికి ఆపరేషన్ చేసేందుకు హంగేరీ డాక్టర్ల బృందం ముందుకు వచ్చింది. అయితే, శస్త్రచికిత్స చేస్తే సక్సెస్ శాతం సగమేనని డాక్టర్లు ఆ అవిభక్త కవలల తల్లిదండ్రులకు ముందే స్పష్టం చేశారు. బతికే అవకాశాలు 50 శాతమే ఉంటాయని వివరించారు.

ప్రఖ్యాత న్యూరో సర్జన్ ఆద్రాస్ సోకే నేతృత్వంలో 35 మంది నిపుణులైన డాక్టర్లు దాదాపు 30 గంటల పాటు శ్రమించి రబేయా, రుఖయాలను విడదీశారు. ప్రస్తుతం ఈ కవలలు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స సందర్భంగా వీరి పుర్రె, మెదడు భాగాలను విడదీసి, హంగేరీలో ప్రత్యేక పరిస్థితుల మధ్య అభివృద్ధి చేసిన ఆ చిన్నారుల కణజాలంతో ఖాళీ భాగాలను భర్తీ చేశారు. రబేయా, రుఖయాల పరిస్థితి గురించి తెలుసుకున్న ఏడీపీఎఫ్ (యాక్షన్ ఫర్ డిఫెన్స్ లెస్ పీపుల్ ఫౌండేషన్) ఆపరేషన్ కు సాయం చేసింది.

Related posts