telugu navyamedia
తెలుగు కవిత్వం సామాజిక

హాలికుడు-సైనికుడు.

brathuku chitram poetry corner

(అభినందన గేయం).

హాలికుడ సైనికుడ -అడుగడుగు దండాలు
అందుకో వందనాలు-అభినందన చందనాలు
దరణి యందు దాతలు -పుడమి యందు పూజ్యులు
నేలతల్లి ఋణము దిర్చు-సాహస గుణశీలురు”హా

సంపదల సృష్టికర్త-సరిహద్దు రక్షకుడ
కడుపు నిండ తిండిబెట్టి-కంటి నిండ నిదురనిచ్చి
కలిమి బలుములు మీరు-కర్తవ్యాల కర్మవీరులు
అన్నదాత ఘనకీర్తి-అజరామరం సైనిక స్పూర్తి “హాలి”

హలము బట్టి పొలము దున్నె-గన్నుబట్టి గస్తి దిరిగె
సుధలకు రూపుడా-సుఖ శాంతులిచ్చు ధీరుడ
ఆకలి దీర్చేదొకరు-అభయము నొసగే దొకరు
పుట్లకొద్ది రాసులు-కోట్లకొద్ది దీవెనలు “హాలి”

కరువొచ్చె కాలమొచ్చె-కాల్పుల యుద్దమొచ్చె
పస్తులున్న రోజులెన్నొ-పరితపించె బాధలెన్నొ
వరద ముంపు గోసలు-వనగూర్చిన సేవలు
విపత్తులెన్నైనా-విధికి తలవంచని వీరుడ “హాలి”

భరత జాతి ప్రగతికి-గిర గిర గీరలై
అరక సాచి సాగులు-అతిరథ మహా యోధులు
వీరులు శూరులు-విజయపు ధర హాసులు
పౌరుషాల పోరులు -పరమ వీర చక్రలు “హాలి” 👏👏👏👏👏👏👏👏👏👏👏
జైజవాన్ జైకిసాన్-జైజైజవాన్ జైజైకిసాన్.

బస్వోజు లక్ష్మణాచారి
ఎల్.ఐ.సి.కల్వకుర్తి.

Related posts