telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ విద్యా వార్తలు

ఏపీలో ఇంకా తగ్గని ఎండలు.. ఒంటిపూటే పాఠశాలలు..

half day schools in AP since high temp

నేటి నుండి పునః పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహంచనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 61 వేల పాఠశాలలు నేటి నుంచి తరగుతులు జరుగుతన్నాయి. అయితే తీవ్రమైన ఎండలు ఉన్న తరుణంలో పిల్లలు బడిపంపడానికి తల్లిదండ్రులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఎండలవలన ఏటువంటి ప్రమాదం జరగకుండా ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ఒంటిపూట బడులు నడపటానికి చర్యలు తీసుకుంది. వేడిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 16వ తేదీ వరకూ ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నారు. జనవరి 26న ప్రారంభమయ్యే ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ.15వేలను ఇవ్వనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారిని ఈ పథకం కింద అర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజన్నబడిబాట కార్యక్రమాన్ని ఉదయం పూట, లేదా సాయంత్రం పూట నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ప్రభుత్వం సూచించింది.

Related posts