telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ తో… హ్యాకింగ్ సాధ్యమే…: నిపుణులు

haking is possible with military grade frequency

2014 ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని, అందుకు బీజేపీ మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఈవీఎం లను హ్యాకింగ్ చేసిందని వార్తలు సామజిక మాధ్యమాలలో హాల్ చల్ చేస్తున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వీటిపై స్పష్టత ఇస్తున్నట్టుగా సరిగ్గా ఇవే ఆరోపణలతో ముందుకు వచ్చాడు సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా. దీనిపై నిపుణులను సంప్రదించగా, మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఈవీఎం లను హ్యాకింగ్ చేయడం సాధ్యం అని తేలింది. దీనితో బీజేపీ ఎన్నికల సమయంలో మరో పెద్ద ఉచ్చులో పడింది..ఈ నేపథ్యంలోనే బీజేపీ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం రిలయన్స్ తో కుదుర్చుకుందని స్పష్టం అవటంతో, ఆ కుంభకోణం కూడా నిజంగా జరిగినట్టే అని నిర్దారణకు వచ్చేయవచ్చు. బహుశా ఈ దెబ్బలు బీజేపీకి కోలుకోలేని వినాశనాన్ని జాతీయంగా తెచ్చిపెట్టడం ఖాయం అంటున్నారు రాజకీయ నిపుణులు.

సాధారణంగా రేడియో ఫ్రీక్వెన్సీ మూడు కేటగిరీల్లో ఉంటుంది. హై-ఫ్రీక్వెన్సీ (హెచ్‌ఎఫ్‌), వెరీ హై-ఫ్రీక్వెన్సీ (వీహెచ్‌ఎఫ్‌) మొదటి రెండు రకాలు కాగా.. మూడో కేటగిరీలో అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ (యూహెచ్‌ఎఫ్‌), ఎల్‌, ఎస్‌ బ్యాండ్లు ఉంటాయి. వీటిలో హెచ్.ఎఫ్ లో అతి తక్కువ ఫ్రీక్వెన్సీ స్థాయి(3మెగా హెర్‌ట్జ్‌ నుంచి 30 మెగా హెర్‌ట్జ్‌), తరంగదైర్ఘ్యం (100-10 మీటర్లు) ఉంటాయి. తొలినాళ్లలో హెచ్‌ఎ్‌ఫలోని వేర్వేరు బ్యాండ్లను 2జీ ఫోన్ల మాదిరిగా కేవలం కమ్యూనికేషన్‌కు ఉపయోగించేవారు. అప్పట్లో మిలటరీ, పోలీసు విభాగాలతోపాటు.. పెద్ద కంపెనీలు వీటిని ఉపయోగించేవి. మొబైల్‌ ఫోన్ల ఆగమనం తర్వాత.. బడా కంపెనీలు హెచ్‌ఎఫ్‌ బ్యాండ్‌కు స్వస్తి పలుకగా.. ప్రస్తుతం త్రివిధ దళాలు, రక్షణ సంస్థలు, పోలీసు శాఖలు, రాడార్‌ వ్యవస్థలను నిర్వహించే విభాగాలు ఉపయోగిస్తున్నాయి.

ఈ హెచ్‌ఎఫ్‌ బ్యాండ్‌లోనూ భారీ మార్పులు వచ్చాయి. ఉదాహరణకు తెలంగాణలోని గ్రేహౌండ్స్‌ పోలీసు దళం అడవుల్లో కూంబింగ్‌ చేస్తుంటే.. వారెక్కడున్నారో హైదరాబాద్‌లోని అధికారులు ట్రాక్‌ చేస్తారు. అంటే.. లో-పవర్‌ వైడ్‌ ఏరియా నెట్‌వర్క్‌ (ఎల్‌పీవ్యాన్‌) మాదిరిగా కూడా ఈ బ్యాండ్లు ఉపయోగపడుతాయి. 0.3 కేబీపీఎస్‌ నుంచి 50 కేబీపీఎస్‌ వేగంతో డేటా బదిలీ కూడా జరుగుతుంది. మిలటరీ వారు వాడే హెచ్‌ఎఫ్‌ పరికరాల్లో (మిల్‌-స్టాండర్డ్‌) పీసీ-ఇన్‌పుట్‌, యూ.ఎస్.బి పోర్టులు, ఎస్‌ఎంఎస్‌ పంపే సదుపాయం, లొకేషన్‌ ఫైండ్‌, లొకేషన్‌ ట్రాకర్లు ఉన్నాయి. దీని సహాయంతో.. సమీపంలో ఉండే ఫ్రీక్వెన్సీ మాడ్యూల్స్‌ను నియంత్రించడం, అందులోని డేటాను మార్చడం, హ్యాక్‌ చేయడం సులభసాధ్యమేనని టెలికం ఇంజనీర్లు చెబుతున్నారు. అంటే.. ఈవీఎంలలోనూ ఈ బ్యాండ్‌ మాడ్యుల్స్‌ ఉంటే.. వాటిని ప్రభావితం చేయడం సులభమేనంటున్నారు.

గతంలో వీహెచ్‌ఎఫ్‌, హెచ్‌ఎఫ్‌ పరికరాలను కొనుగోలు చేసేవారు అందులో పోలీసులు ఉపయోగించే ఫ్రీక్వెన్సీకి ట్యూన్‌ చేస్తే.. వారి మాటలను వినే అవకాశం ఉండేది. హోమ్ రేడియో వంటి పరికరాలతోనూ వాటిని ట్రాక్‌ చేసే వీలుండేది. ప్రస్తుతం టెక్నాలజీ మారిపోయింది. హెచ్‌ఎఫ్‌ బ్యాండ్‌లో జరిగే కమ్యూనికేషన్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేస్తున్నారు. ఆ ఫ్రీక్వెన్సీని ట్యూన్‌ చేసేవారికి రేడియో శూన్య శబ్దాలు తప్ప.. సంభాషణలు వినిపించవు. ‘ఇప్పుడున్న హెచ్‌ఎఫ్‌ పరికరాలలో భద్రత ఎక్కువ. పైగా.. బ్రాడ్‌బ్యాండ్‌ ఓవర్‌ పవర్‌లైన్స్‌ (బీపీఎల్‌) ఇంటర్నెట్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ బ్యాండ్‌ ద్వారా చేసే ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ను ఇతరులు ట్రాక్‌ చేయలేరు. కానీ, ఇతరుల బ్రౌజింగ్‌ హిస్టరీని ఈ పరికరాల ద్వారా ట్రాక్‌ చేయవచ్చు’ అని సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ఒకరు వివరించారు. ‘మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీలో ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌, ప్రత్యేక అల్‌గారిథమ్‌ ఉంటాయి. ఎవరూ హ్యాక్‌ చేయలేరు. కానీ, ఆ టెక్నాలజీ తెలిసిన వారు ఒకే నెట్‌వర్క్‌లో ఉండే ఇతర పరికరాలను హ్యాక్‌ చేయడం అసాధ్యమేమీ కాదు. ఈవీఎంలలో ఈ టెక్నాలజీ ఉంటే.. మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీతో వాటిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి’ అని నిపుణులు తెలిపారు.

Related posts