telugu navyamedia
సినిమా వార్తలు

గువ్వ గోరింకల్లా..

priya ganam poetry corner

సూరీడు తొంగి చూస్తే…..
కలువభామ విరబూసినట్టు…
నీ చూపుల్లో తొంగి చూసే భావాలతో….
బుగ్గలు ఎరుపెక్కి ……
ఎర్రని గులాబీ లా విచ్చుకుంటున్న పెదాలు !
చిట పట చినుకుల్లో…..
గూటికి చేరిన గువ్వ గోరింకల్లే….
వర్షం రాక తో ……
నీ లోని నాలోని తలపులు…..
చేరేను ఒకే స్వప్న లోకంలో !
పచ్చని పైరు పై వర్షపు చినుకులు మెరిసినట్టు….
నీ పెదాల పై చిరునవ్వు మెరిస్తే ……
చూసే అవకాశమే నాది కాదా ……
నీ ఆనందమే నా పెదాల పై…..
చిరునవ్వుల పూలు పూయించదా !

-జె.పద్మావతి
ఆదోని.

Related posts