వార్తలు సామాజిక సినిమా వార్తలు

‘మీటూ’ అంటున్న గుత్తా జ్వాలా

Gutta Jwala says 'Meetu'

దేశవ్యాప్తంగా మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటి వరకు కేవలం సినీ తారలు మాత్రమే తమను వేధించన వాళ్ల పేరు బయటపెట్టారు. తాజాగా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల చేరారు. తాను కూడా వేధింపులకు గురయ్యానని.. కాకపోతే అవి మానసిక వేధింపులు అంటూ జ్వాల వరుస ట్వీట్‌లు చేశారు.


‘మీటూ ద్వారా నేను నాకు ఎదురైన మానసిక వేధింపులు గురించి వెల్లడించాలనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్‌ అయ్యాడు. అప్పటి నుంచి నన్ను మానసిక వేధింపులకు గురి చేశాడు. నేషనల్‌ చాంపియన్‌ అయిన నన్ను జట్టు నుంచి బయటకు పంపించాడు. నేను బ్యాడ్మింటన్‌కు రాజీనామా చేయడానికి ఇది కూడా ఓ కారణం. నన్ను బయటకు పంపించడమే కాకుండా నాతో పాటు ఆడే నా పార్ట్‌నర్స్‌ని కూడా బెదిరించాడు. నేను రియో ఒలంపిక్స్‌ నుంచి వచ్చిన తరువాత కూడా ఈ వేధింపులు కొనసాగాయి. నేను ఎవరితో అయితే కలిసి మిక్స్‌డ్ ఆడతానో తనను కూడా బెదిరించారు. దాంతో నేను జట్టు నుంచి బయటకు వచ్చేశాను’ అంటూ జ్వాల ట్వీట్‌ చేశారు.

Related posts

నేడు మంచి ముహూర్తం..నామినేషన్లు వేయనున్న ప్రముఖులు!

madhu

అందుకే 48 కట్స్

admin

నిజాం మ్యూజియం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

madhu

Leave a Comment