telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సాగర్ ఎన్నికలపై గుత్తా ఆసక్తికర వ్యాఖ్యలు…

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నికల అనివార్యం అయింది. అన్ని పార్టీలు నాగార్జున సాగర్‌ లో ఎలాగైనా గెలవాలని పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తి కర కామెంట్స్‌ చేశారు. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవం చేసే ఆలోచన చేయాలని సూచించారు. సాగర్ ఉపఎన్నికలో తనకు పోటీ చేయాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతేకాదు… కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై గుత్తా సుఖేందర్‌ రెడ్డి స్పందించారు. దేశ రాజధానిలో రైతుల ఆందోళన ఆవేదన కలిగిస్తుందని… రైతులతో రాబోయే చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు గుత్తా. రాష్ట్రాలపై భారం వేసి కేంద్రం చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని… ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. కేంద్రం ఇప్పటికైనా రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

Related posts