telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

గురుకులాల్లో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ

Gurukulam entrance exam notification released

తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈనెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 2019–20 విద్యా సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో అదనంగా 119 గురుకుల పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో నాలుగు సొసైటీల పరిధిలో 616 గురుకుల పాఠశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49,280 సీట్లు భర్తీ చేయనున్నారు.

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తిచేయాల్సి ఉంటుంది.దరఖాస్తు సమర్పణ సమయంలోనే రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 18వ తేదీనుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి దరఖాస్తుదారుడు తన ఆధార్‌ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాల్సిందే. ఏప్రిల్‌ 7వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారు. గురుకుల పాఠశాలలకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1800–425–45678 నంబర్‌లో.. లేదా http://tswreis.in, http://tresidential. cgg.gov.in, http:cwreis.cgg.gov.in, http://tgcet.cgg. gov.in వెబ్‌సైట్‌లను చూడాలని సెట్‌ చీఫ్‌ కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Related posts