వార్తలు విద్య వార్తలు సామాజిక

బాలుకు “గురు దేవోభవ ” పురస్కారం

Guru Devobhava Award, Kayyuru Balaasubrahmanyam

పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి, మిమిక్రీ కళాకారుడు కయ్యూరు బాలసుబ్రమణ్యం శనివారం యూత్ హాస్టల్, తిరుపతిలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో తుడా ఛైర్మన్ నరసింహ యాదవ్ చేతుల మీదుగా “గురు దేవోభవ” పురస్కారాన్ని వే ఫౌండేషన్ సంస్ధ వారిచే అందుకున్నారు. ఉత్తమ బోధన మరియు కళలు, సాహిత్యం రంగాలలో కృషిచేసినందుకుగాను ఈ అవార్డును ఇస్తున్నామని సంస్ధ అధ్యక్షుడు పైడి అంకయ్య చెప్పారు.

ఈ కార్యక్రమం లో తిరుపతి షీ టీమ్ కన్వీనర్ సుమతి, తిరుపతి మరియు చంద్రగిరి, మండల విద్యాశాఖాధికారులు బాలసుబ్రమణ్యం లలిత కుమారి, ఆర్.జె.డి.రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షురాలు సుమన తదితరులు పాల్గొన్నారు. బాలుకు అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు.

Related posts

ఇదిగో దొర, గత నాలుగేళ్ళుగా ఆంధ్ర “రాక్షసుడు” సాధించిన విజయాలు..

admin

రమణదీక్షితులపై… టీటీడీ పరువునష్టం దావా.. 200 కోట్లకు…

chandra sekkhar

మొత్తానికి ఎన్టీఆర్ ని రంగంలోకి ధించిన చంద్రబాబు …రేపే నామినేషన్

jithu j

Leave a Comment