telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

విజయవాడ : .. మహాకవి గుర్రం జాషువా .. 124వ జయంతి ఉత్సవాలు..

gurram jashuva 124th birth celebrations

ఈ నెల 21 నుంచి 28 వరకూ మహాకవి గుర్రం జాషువా 124వ జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి విజయవాడలోని జాషువా సాంస్కృతిక వేదిక సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 21న ప్రజాకళాకారులు మాచినేని వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కొండపల్లిలోని ఆంధ్రపబ్లిక్‌ స్కూల్‌ వద్ద సాయంత్రం 5 గంటలకు ప్రారంభ సభ, పాటలు, జానపద నృత్యాలు, ఆధునిక నృత్యాలు, ఏకపాత్రలు, క్లాసికల్‌ డ్యాన్సుల పోటీలు నిర్వహిస్తారు. 22న అదే వేదికపై సభానంతరం కవిసమ్మేళనం, కోలాటాలు, షార్ట్‌ ఫిలిమ్‌ ప్రదర్శనలు నిర్వహిస్తారు. 23న సాయంత్రం 5 గంటలకు రాణిగారితోట- విజయవాడలో కార్మిక నాయకులు టి సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం సామాజిక అంశాలపై షార్ట్‌ ఫిలిమ్‌ ప్రదర్శనలు, బాలబాలికలతో ఆట పాట కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. 24న ప్రజాకవి సుంకర సత్యనారాయణ జ్ఞాపకార్థం మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు యంగ్‌తరంగ్‌ రాష్ట్రస్థాయి గ్రూప్‌ డ్యాన్సు పోటీలు ఉంటాయి.

25న విద్యాధరపురంలోని మర్రిచెట్టు సెంటర్‌ వద్ద సాయంత్రం 5 గంటలకు ప్రజాకళాకారులు కుండనాల భాస్కరరావు జ్ఞాపకార్థం జాషువాపై నృత్య రూపకాలు, షార్ట్‌ ఫిలిమ్‌ ప్రదర్శనలు నిర్వహిస్తారు. 26న ఉదయం10 గంటలకు ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్‌ మోహన్‌ జ్ఞాపకార్థం ఎంబి విజ్ఞాన కేంద్రంలో చిత్రకళా ప్రదర్శన, ఆర్ట్‌ గ్యాలరీ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 26 నుంచి రెండు రోజుల పాటు 50 లఘుచిత్రాల ప్రదర్శన, పోటీలను ప్రజావైద్యులు మాకినేని రామారావు జ్ఞాపకార్థం ఎంబి విజ్ఞానకేంద్రంలోని చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహిస్తారు. 27న ఉదయం 10 గంటలకు ఎంబి విజ్ఞానకేంద్రంలో సినీదర్శకుడు కోడి రామకృష్ణ జ్ఞాపకార్థం రాష్ట్ర స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ మేకర్స్‌ సదస్సు నిర్వహిస్తున్నారు. 28న ఉదయం 10 గంటలకు ఎంబి విజ్ఞాన కేంద్రంలో మహాకవి గుర్రం జాషువా జ్ఞాపకార్ధం సాహితీస్రవంతి సహకారంతో కవిసమ్మేళనాన్ని జరపనున్నారు. వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబరు: 9391163508.

Related posts