telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చీరాలలో గురజాడ జయంతి

మహాకవి గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన అభ్యుదయ కవి. తెలుగు సాహిత్యానికి మార్గదర్శి అయిన గురజాడ 159వ జయంతి సందర్భగా సప్త స్వరాలు పేరుతో ఒక కవి సమ్మేళనం ఏర్పాటు చేశామని, గురజాడ స్ఫూర్తి కొనసాగించడమే దీని లక్ష్యమని నిర్వాహకుడు అప్పాజోస్యుల సత్యనారాయణ తెలిపారు. సాహితీ ప్రియుల కోసం తమ చారిటబుల్ ట్రస్టు తరుపున నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

తాను కంప్యూటర్ రంగంలో వున్నా, సాహిత్యంపై మక్కువతో ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నాని సత్యనారాయణ చెప్పారు .
చీరాల లోని సంత బజారులో వున్న వేణు గోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో అప్పాజోస్యుల చారిటబుల్ ట్రస్టు సోమవారం రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కవి సమ్మేళనంలో బీరం సుందర రావు , వడలి రాధాకృష్ణ మూర్తి, తిమ్మన శ్యామ్ సుందర్, పి . శ్రీనివాస గౌడ్,ఎం . కృష్ణ మోహన్, సజ్జా వెంకటేశ్వర రావు వివిధ అంశాలపై కవితలు వినిపించారు.

Related posts