telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరీంనగర్ కు గన్ పౌడర్ అక్రమ రవాణా…

పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం ఉన్నట్లు తేలడంతో… హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే కరీంనగర్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేసారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో పాతబస్తీ అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం గురించి వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో 1000 కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా కరీంనగర్ & ఖమ్మం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు డిటోనేటర్ పేలుడు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ & సిటీ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శ్రీరామ, హెచ్ఎంటి ట్రాన్స్ పోర్ట్ లో తనిఖీలు చేపట్టగా డిటోనేటర్ పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. తయారు చేసిన గన్ పౌడర్ ను కరీంనగర్ కి రవాణా చేస్తున్నాడు షబ్బీర్ అనే నిందితుడు. అమొనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్ పదర్థం ద్వారా గన్ పౌడేర్  తయారు చేస్తున్నాడు షబ్బీర్ అనే నిందితుడు. అయితే ఆ గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఫాలక్ నామ పోలీసులకు అప్పగించారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. దీనికి పేలుడు సామర్థ్యము తక్కువ గా ఉంటుందని పోలీసులు తెలిపారు. 2018 లో  లైసెన్స్ ద్వారా గన్ పౌడర్ ను తయారు చేస్తున్నాడు షబ్బీర్.

Related posts