telugu navyamedia
సినిమా వార్తలు

“గుణ 369” టీజ‌ర్‌ విడుదలకు ముహూర్తం ఖరారు

Guna-369

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన హీరో కార్తికేయ ఇటీవలే “హిప్పీ” అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది. తాజాగా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ నటిస్తున్న చిత్రం “గుణ 369”. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఇటీవ‌ల “గుణ 369” చిత్రానికి సంబంధించి కార్తికేయ‌ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో చాలా కూల్‌గా పంచెకట్టుతో క‌నిపిస్తున్నాడు. ఇక చిత్ర టీజ‌ర్‌ని జూన్ 17న విడుద‌ల చేస్తున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు చిత్రబృందం.ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న అన‌గ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం తప్పకుండ ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం.

Related posts