telugu navyamedia
telugu cinema news

“గుణ 369” టీజర్ వచ్చేసింది

Guna-369

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన హీరో కార్తికేయ ఇటీవలే “హిప్పీ” అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చింది. తాజాగా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ నటిస్తున్న చిత్రం “గుణ 369”. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఇటీవ‌ల “గుణ 369” చిత్రానికి సంబంధించి కార్తికేయ‌ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో చాలా కూల్‌గా పంచెకట్టుతో క‌నిపిస్తున్నాడు. ఇక చిత్ర టీజ‌ర్‌ని జూన్ 17న విడుద‌ల చేస్తున్న‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు చిత్రబృందం. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న అన‌గ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం తప్పకుండడా ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రబృందం. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.

తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. “మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితాని కి ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. కానీ ప‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ జ‌ర‌గ‌కూడ‌దు” అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌ల‌తో ఈ టీజర్ విడుదలైంది. విడుదలైన కొద్ది క్ష‌ణాల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఇందులో హీరో ఓ అమ్మాయి ముందు నిలుచుని `స్మైల్ ఇవ్వొచ్చు క‌దా ఒక్క సెల్ఫీ..`, `నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా బ‌ల‌వంతంగా ష‌ట్ట‌ర్ క్లోజ్ చేసి ఒక‌మ్మాయితో మాట్లాడ‌తాన‌నీ.. నాతో మీరు మాట్లాడాల్సిన ప‌నిలేదు. మీతో మీరు మాట్లాడేయండి` అని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. `మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్ల‌ను చూసి భ‌య‌ప‌డేది, గొడ‌వ‌లంటే మూసుకుని కూర్చునేది మాకేద‌న్నా అవుతుంద‌ని కాదు. మా అనుకున్న వాళ్ల‌కు ఏద‌న్నా అవుతుంద‌న్న చిన్న భ‌యంతో…` అని టీజ‌ర్‌లో ఆఖ‌రిగా హీరో నోటి వెంట వ‌చ్చే డైలాగులు మాస్ జ‌నాలను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts

సాహో : “ఏ చోట నువ్వున్నా…” సాంగ్‌ టీజ‌ర్

vimala p

తెరపైకి “రుద్రాక్ష”తో కృష్ణవంశీ

vimala p

ఆర్ఆర్ఆర్ : ఆ టైటిల్ కే జక్కన్న ఫిక్స్…?

vimala p