telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఎక్స్ 100” హీరో కొత్త సినిమా లుక్

Guna-369

“ఆర్ఎక్స్ 100” తో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిలో పడ్డాడు హీరో కార్తికేయ. ప్ర‌స్తుతం ఈ హీరో ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఆయ‌న న‌టిస్తున్న బైలింగ్యువ‌ల్ చిత్రం “హిప్పీ” త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక నాని తాజా చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్‌”లో విల‌న్‌గా కూడా కనిపించ‌నున్నాడు కార్తికేయ. ఆయ‌న న‌టిస్తున్న‌ మూడో చిత్రం “గుణ 369” అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ఇటీవ‌ల “గుణ 369” చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ విడుద‌ల కాగా, ఇందులో కార్తికేయ ముఖాన్ని దాచారు. తాజాగా కార్తికేయ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో చాలా కూల్‌గా పంచెకట్టుతో క‌నిపిస్తున్నాడు.

Related posts