telugu navyamedia
సినిమా వార్తలు

ఆస్కార్ బరిలో ఉత్త‌మ విదేశీ భాషా చిత్రంగా “గల్లీబాయ్”

Gully-Boy

ఇటీవల బాలీవుడ్ లో భారీ హిట్ సాధించిన సినిమాల్లో “గల్లీబాయ్” కూడా ఉంది. రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది.ఇప్పుడు “గ‌ల్లీబాయ్” చిత్రం అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. 92వ ఆస్కార్ అవార్డుల బ‌రిలో ఈ సినిమా పోటీ ప‌డ‌నుంది. ర‌ణ‌వీర్ సింగ్‌, ఆలియా భ‌ట్ జంట‌గా న‌టించారు. “మ‌న టైమ్ వ‌చ్చేసింది. ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు. ర‌ణ‌వీర్‌, జోయాఅక్త‌ర్‌, ఆలియా భ‌ట్ స‌హా చిత్ర బృందానికి అభినంద‌న‌లు. “గ‌ల్లీబాయ్” 92 ఆస్కార్ బ‌రిలో ఉత్త‌మ విదేశీ భాషా చిత్రంగా పోటీ ప‌డ‌నుంది” అంటూ విష‌యాన్ని నిర్మాత ప‌ర్హాన్ అక్త‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఆస్కార్‌లో పోటీ ప‌డబోయే ఉత్త‌మ విదేశీ భాషా చిత్రం కోసం ప‌లు భాష‌ల‌కు చెందిన 28 సినిమాల‌ను ఎంపిక చేసింది. అందులో తెలుగు నుండి “డియ‌ర్ కామ్రేడ్” కూడా ఉంది. ఇందులో 27 చిత్రాల‌ను దాటి “గ‌ల్లీబాయ్” ఆస్కార్ బ‌రిలో దిగుతుంది. ఏదైతేనేం… ఎంటైర్ “గ‌ల్లీబాయ్” యూనిట్‌కు అభినంద‌న‌లు.

Related posts