telugu navyamedia
రాజకీయ వార్తలు

మాజీ సీఎంలను గృహనిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటి? : గులాంనబీ ఆజాద్

Congress Gulamnabhi ajad fire Bjp

జమ్మూకశ్మీర్ లో ముగ్గురు మాజీ సీఎంల గృహనిర్బంధంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పందించారు. రాష్ట్రంలో పరిస్థితులను అల్లకల్లోలంగా మార్చారు. ఏకంగా ముగ్గురు మాజీ సీఎంలను గృహనిర్బంధం చేయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని ఆజాద్ విమర్శించారు. పెద్దనోట్ల రద్దు సమయంలోనూ రాత్రికిరాత్రి నిర్ణయం తీసుకుని భారత ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొన్నటివరకూ కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. పాఠశాలలు, కాలేజీలు జరుగుతున్నాయి. పర్యాటకులు కూడా హాయిగా వచ్చిపోతున్నారన్నారని తెలిపారు.టూరిజంకు కీలకమైన ఆగస్టు నెలలో పర్యాటకుల్ని వెనక్కు పిలిపించి జమ్మూకశ్మీర్ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్నారని మండిపడ్డారు. కశ్మీర్ లో ప్రధాన రాజకీయ పార్టీలను అంతంచేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం చేపట్టే ఎలాంటి చర్యనైనా తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం ఆజాద్ చేశారు.

Related posts