telugu navyamedia
రాజకీయ వార్తలు

గుజరాత్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త.. వేతనాలు పెంచిన ప్రభుత్వం

gujarat rtc

గుజరాత్ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికుల వేతనాలు గణనీయంగా పెంచింది. దీపావళి కానుకగా బీజేపీ ప్రభుత్వం ఈ పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఒకవైపు తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న తరుణంలో గుజరాత్ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. వివరాలిలా ఉన్నాయి. స్థిర వేతనం పొందుతున్న 12,692 మందికి జీతాలు పెంచుతున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

పెరిగిన వేతనాలు ఈ రోజు(అక్టోబర్ 16వ తేదీ బుధవారం) నుంచే అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ప్రకటించారు. వేతనాలు పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఏటా రూ. 92.40 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని తెలిపారు. సీనియర్ క్లాస్-3 సూపర్ వైజర్ ఇప్పటి వరకు రూ. 14,500 తీసుకుంటుండగా… ఇకపై రూ. 21 వేల మేరకు వేతనం పొందనున్నారు. డ్రైవరు, కండకార్లకు కూడా వేతనాలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది.

Related posts