telugu navyamedia
వార్తలు సామాజిక

కొట్టుకెళ్లి సరుకులు తెమ్మన్న తల్లి..పెళ్లాన్ని తెచ్చుకున్న కొడుకు!

Lockdown lover marriage

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఓ తల్లి తన కొడుకును కొట్టుకెళ్లి పచారీ సరుకులు తీసుకురావాలని కోరింది. ఇదే అదనుగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన కొడుకు పెళ్లాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. యూపీలోని ఘజియాబాద్ లో జరిగిన ఈ ఘటన పోలీసులూ విస్తుపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడికి సమీపంలోని స‌హీదాబాద్ ‌కు చెందిన గుడ్డు అనే యువకుడు, రెండు నెల‌ల క్రితం స‌వితా అనే యువతిని ప్రేమించి, ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లికి ప్రత్యక్ష సాక్షులు లేకపోవడంతో మ్యారేజ్ సర్టిఫికెట్ లభించలేదు.

దీంతో ఆమెను ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితుల్లో గుడ్డూ ఉండిపోయాడు. ఈలోగా లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. భార్యను ఢిల్లీలోని ఓ అద్దె ఇంట్లో ఉంచి తను మాత్రం ఇంట్లోనే ఉండిపోయాడు. ఇటీవల గుడ్డూ తల్లి, కొట్టుకెళ్లి పచారీ సరుకులు తీసుకురావాలని కోరింది. ఇదే అదనుగా, ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను గుడ్డూ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తాను వివాహం చేసుకున్న సవితను వెంటేసుకుని ఇంటికి వచ్చాడు. దీంతో సవితను ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తే లేదని తల్లి పోలీసులను ఆశ్రయించింది. లాక్ డౌన్ ముగిసేంత వరకూ సవితను ఢిల్లీలోని అద్దె ఇంట్లోనే ఉండాలని చెప్పి ఒప్పించారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత ఈ కేసును తేలుస్తామని వెల్లడించారు.

Related posts