telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బ్యాచిలర్ కూడా ఇచ్చేసాడుగా…

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరో అక్కినేని అఖిల్ కు మంచి క్రేజ్ ఉంది. కానీ ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ ను అందుకోలేకపోయాడు అఖిల్. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో  ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. ఈ చిత్రంలో అఖిల్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది.ఇక రేపు వాలెంటైన్స్ డే సందర్బంగా ఈ బ్యాచిలర్ సినిమా నుంచి ‘గుచ్చే గులాబి’.. లిరికల్ వీడియో రిలీజైంది. గీతా ఆర్ట్స్-2 బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు వాసు వ‌ర్మ కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గోపిసుంద‌ర్ సంగీత స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌రైన హిట్టు లేని అఖిల్ ప్ర‌స్తుతం ఈ సినిమాపైనే చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అక్కినేని ఫ్యామిలీ హీరోస్ లో నాగచైతన్య మూవీ ‘లవ్ స్టోరీ’ ఏప్రిల్ 16న రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటన వచ్చింది. ఇక అక్కినేని బాస్… అక్కినేని నాగార్జున మూవీ ‘వైల్డ్ డాగ్’ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటనే రావాల్సి ఉంది! చుడాలిమరి ఈ అక్కినేని హీరోల సినిమాలు అభిమానులను ఆకట్టుకుంటాయా… లేదా అనేది.

Related posts