telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆ వస్తువులపై .. జిఎస్టి పెంపు నిర్ణయంలో కేంద్రం..

1 crore loan on proper gst payers

కేంద్ర ప్రభుత్వం ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించే దశలో జిఎస్టి రేట్లు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు ఉన్న శ్లాబ్ లను కూడా మార్చే అవకాశం ఉన్నట్లు జిఎస్టి వర్గాలు తెలుపుతున్నాయి. ఈనెల 18వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్నో ఆసక్తికర అలాగే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ అమలుపరిచి రెండు సంవత్సరాలు పైన కావస్తున్న కూడా ఇప్పటికీ జీఎస్టీ వసూలు పెరగకపోవడం పై కఠిన వైఖరిని అవలంబించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు గత ఐదు నెలల నుంచి వారికి వాటా వారి ఇవ్వడం లేదు. దీనిపై ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం జిఎస్టి లో ఉన్న 5,12,18,28 స్లాబ్ లోని మూడిటిగా కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొన్ని వస్తువులకి జిఎస్టి కి తోడుగా సెస్ కూడా విధిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనిని వస్తువుల అసలు ధర కన్నా జిఎస్టి రేట్ ఎక్కువ ఉండేలా కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిఎస్టి లో ఉన్న 5 శాతం శ్లాబ్ 8 శాతానికి, 12 శాతంగా ఉన్న రేటును 15 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జీఎస్టీ వసూల్ లో ఏకంగా 40 శాతం మేర కోత పడినట్లు తెలుస్తోంది. అలాగే జి.డి.పి వృద్ధి రేటు కూడా కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇదే గనుక జరిగితే ప్రతి ఇంట్లో నిత్యం వాడే వస్తువుల పై తీవ్ర ప్రభావం కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిత్యం వాడే చక్కెర,నూనె, టూత్ పేస్ట్,కొబ్బరి అలాగే తిండి వస్తువులపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Related posts