telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జీఎస్టీ చెల్లింపులు తగ్గుముఖంపై .. నిరుత్సహంలో బీజేపీ…

1 crore loan on proper gst payers

దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడుతున్న విషయం తెలిసినా, ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకుంటున్న కేంద్రం పై మరో బండ పడింది. దేశ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్ నెలలోనూ జీఎస్టీ వసూళ్లు తగిపోయాయి. ఆశించిన దాని కంటే తక్కువగానే వసూళ్లు నమోదయ్యాయి. సెప్టెంబర్ లో 91వేల కోట్ల రూపాయలు జీఎస్టీ ద్వారా వసూలయ్యాయి. మాంద్యం కారణంగా అక్టోబర్ లోనూ వసూళ్లు తగ్గుతాయేమోనని ఊహించినట్టే జరిగింది. అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు నిరాశాజనకంగానే ఉన్నాయి. 2018 అక్టోబర్ లో జీఎస్టీ వసూళ్లు లక్షా ఏడువేల కోట్ల రూపాయలు.

ఈ ఏడాది అక్టోబర్ లో ఈ వసూళ్లు 95 వేల 380 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాయి. ఈ వసూళ్లు సాధారణంగా ఏటికేడు పెరుగుతుంటాయి. కానీ.. ఆర్థిక మందగమనంతో వరుసగా మూడోనెల లోనూ జీఎస్టీ వసూళ్లలో తగ్గుదల నమోదైంది. ఇప్పటికే దేశ ఆర్థిక పరిస్థితి మంద్యంలోకి జారిపోకుండా.. కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రంగాల్లో పన్నులను తగ్గిస్తున్నారు. ఉద్దీపన పథకాలు ప్రకటిస్తున్నారు. కానీ అవేమీ అంతగా ఫలిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.

Related posts