telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రేపటి నుండే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు…

తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర ఒప్పందం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ఎండీలు సంతకాలు చేశారన్న ఆయన ఎపి మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు కోవిడ్ సమయంలో ఆగిపోయిన బస్సులు పునప్రారంభం అయ్యేటప్పుడు అంతరాష్ట్ర ఒప్పందం జరగాలని సూచించారని ఈరోజు రెండు కార్పొరేషన్ లకి మంచి అభివృద్ధి ఉండేలా ఒప్పందం ఉందని ఆయన అన్నారు. ఈ రోజు రాత్రి నుండి ఇరు రాష్ట్రాల బస్సులు ప్రారంభం అవుతున్నాయని ఆయన అన్నారు. గతంలో మేము నడుపుతున్న లక్ష 60 వేల కిలోమీటర్ల మేరకు ఏపీఎస్ ఆర్టీసీ కూడా లక్ష 60 వేల కిలోమీటర్ల నడపడం వల్ల ఈ కోవిడ్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన అన్నారు. కోవిడ్ సమయంలో తెలంగాణ ఆర్టీసి కి దాదాపు 2000 కోట్ల నష్టం వచ్చిందన్న అయన ఈ బస్సుల అంశంలో ఉద్దేశ్య పూర్వకంగా ఆలస్యం చేయలేదని అన్నారు. తెలంగాణ ఆర్టీసి కి సంబంధించి చార్జీల విషయంలో ఎలాంటి మార్పులు లేవన్న అయన ప్రస్తుతం ఇరు రాష్ట్రాలకు ఓ అర్ 50-60 మాత్రమే ఉందని తెలిపారు. 

Related posts