telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తేజస్‌ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఆమోదం…

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత వైమానిక దళాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మన వాయుసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా 48 వేల కోట్లతో 83 తేజస్‌  ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుకు ఆమోద ముద్రవేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ ఫైటర్‌ జెట్‌ల కొనుగోలుతో మన వాయిసేన మరింత బలంగా మారనుంది… తేజస్‌  ఫైటర్‌ జెట్‌ల కొనుగోలు నిర్ణయం దేశ రక్షణ రంగం స్వయం సమృద్ధికి దోహదం చేస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రానున్న రోజుల్లో ఈ ఫైటర్‌ జెట్‌లు భారత వాయుసేనను మరింత పటిష్టం చేయనున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా స్వదేశీ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధాని చారిత్రక నిర్ణయం తీసుకున్నారని రాజ్‌నాథ్ ప్రశంసించారు. మొత్తం జెట్‌లలో… 73 తేజస్‌ ఎంకే-1ఏ ఫైటర్‌ జెట్‌లు, 10 తేజస్‌ ఎంకే-1ఏ శిక్షణా జెట్‌లు ఉండనున్నాయి. ఈ జెట్‌లలో పెద్ద సంఖ్యలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించనున్నారు. తేజస్‌ విమానాలను హిందుస్థాన్‌ ఏరోనాటికల్‌ సంస్థ తయారు చేస్తోంది. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts