telugu navyamedia
news political Telangana

రెండో విడుత పంచాయతీ పోలింగ్ ప్రారంభం

Gram Panchayat elections Poling started

తెలంగాణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రెండో విడుత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటవర మాత్రమే జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా వార్డుస్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌స్థానాల ఓట్లను లెక్కిస్తారు. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా ఏర్పాట్లు చేసింది.

ఈ విడుతలో 4,135 గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతోపాటు, కోర్టు కేసుల నేపథ్యంలో ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. ఈ విడుతలో మొత్తం 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,342 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 10,668 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు.

Related posts

ప్రధాని నరేంద్ర మోడీ ఔదార్యం

ashok

తెలంగాణ వ్యాప్తంగా .. పలు ప్రాంతాలలో వర్షాలు.. రాకపోకలకు అంతరాయం..

vimala p

రేగిపండ్లలో… ఆరోగ్య.. రహస్యాలు…

vimala p