telugu navyamedia
క్రీడలు వార్తలు

వెస్టిండీస్‌ పర్యటనకు డివిలియర్స్..?

2018 ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా మ్యాచ్‌లాడిన ఏబీ.. టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేకపోవడంతో నిరాశగా స్వదేశానికి వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 2021లో ఏబీ డివిలియర్స్ అద్భుతంగా ఆడాడు. దీంతో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఏబీని ఆడించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో సఫారీ క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్‌ స్మిత్.. డివిలియర్స్ రీఎంట్రీపై శుక్రవారం తుది నిర్ణయం తీసుకోనున్నాడట. దక్షిణాఫ్రికా జట్టు త్వరలోనే వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఐదు టీ20 సిరీస్‌లను ఆడబోతోంది. టీ20 జట్టులోకి ఏబీ డివిలియర్స్‌ని ఎంపిక చేయాలని దక్షిణాఫ్రికా బోర్డు పెద్దలు చూస్తున్నారు. డివిలియర్స్ ఒక్కడే కాదు.. ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరీస్‌లను కూడా మళ్లీ టీ20 జట్టులోకి తీసుకురావాలని గ్రేమ్ స్మిత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఏబీడీ రీఎంట్రీపై గ్రేమ్ స్మిత్ ఈరోజు అధికారికంగా ఒక ప్రకటనని విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాదు వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా అతడిని ఎంపికచేయనున్నాడు. అయితే ఏబీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు. కానీ టీమ్‌ భవిష్యత్‌ని పట్టించుకోకుండా స్వార్థంగా అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని అప్పట్లో విమర్శించి.. అతని పునరాగమనాన్ని వ్యతిరేకించారు. దాంతో ఏబీ కూడా మౌనంగా ఉండిపోయాడు.

Related posts