telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గో సంరక్షణ బాధ్యతలు … తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం…

Mamatha Break Yogi Rali West Bengal

గోవును పవిత్రంగా భావించి, పూజించే దేశంలోనే గో వధ కూడా జరుగుతుండటం జీర్ణించుకోలేని విషయం. అయితే దీనిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. చాలా మంది నాణేనికి రెండు వైపులు ఉంటాయి అంటున్నా, హిందూ సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ వస్తున్న భారతదేశంలో గో సంరక్షణ జరగాలి కానీ, వధ కాదని పెద్దలు చెపుతున్నారు. దీనితో గో సంరక్షణ బాధ్యతలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకునేట్టుగా తాజాగా, గోవుల సంరక్షణ కోసం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‌ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని ఎక్సైజ్‌, ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించాలని కేబినెట్‌ ఆమోదించింది.

‘గో సంరక్షణ సెస్‌’ పేరుతో దీన్ని అమలు చేస్తారు. పట్టణ, గ్రామీణ పౌర సంస్థల ఆధ్వర్యంలో తాత్కాలికంగా ‘గోవంశ్‌ ఆశ్రయ్‌ ఆస్థల్‌’లను ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఆవుల సంరక్షణ కోసం తాత్కాలికంగా షెడ్లు నిర్మిస్తారు. ఒక్కో షెడ్డులో వెయ్యి పశువులకు ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంరక్షించే స్థోమత లేక చాలా మంది రైతులు తమ పశువులను వదిలేస్తున్నారని, ఇలాంటి షెడ్ల వల్ల వాటికి ఆశ్రయం లభిస్తుందన్నారు. అలాగే రోడ్లపై తిరిగే పశువులకు కూడా ఆశ్రయం కల్పించినట్లవుతుందని చెప్పారు. సంబంధిత విభాగాలు పరస్పర సహకారంతో ఆవుల సంరక్షణ చేస్తారని అధికారులు వెల్లడించారు.

ఈ బాధ్యత తీసుకుందాం అన్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ గేదెల గడ్డి పై కూడా స్కాం లు చేసిన ఈ దేశంలో, గో సంరక్షణశాలలు అనుకున్నవిధంగా నిర్వహణ లోపం లేకుండా సాగగలవా.. అనేది ఇక్కడ కూడా వస్తున్న అతిపెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలో కూడా నిజం లేకపోలేదు, ఈ సంరక్షణ అంటూ పెట్టుకుంటే, దానికి కొన్ని నిధులు కేటాయించాలి, మరి నిధులు అంటూ ఉంటె, పందికొక్కులు వాటిని తినే అవకాశాలు ఉంటాయి.. మరి ఈ ఆలోచన ఎంతవరకు సరైనదో..వేచిచూడాలి.

Related posts