telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సాంకేతిక

కాలుష్య నివారణకు.. కరెంటు వాహనాలు .. బోలెడు రాయితీలు..

no registration charges to electric vehicles

ఇప్పటివరకు దాదాపుగా అన్ని వాహనాలలో ఇంధనంగా చమురునే వాడుతున్నారు. దీని వల్ల కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ సమస్యను నివారించే ఉద్దేశంతో అన్ని దేశాలు విద్యుత్‌తో నడిచే వాహనాల సంఖ్యను పెంచేందుకు కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా భారతప్రభుత్వం కూడా ఇదే పనిలో పడింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల రవాణాశాఖలు విద్యుత్‌ సహాయంతో నడిచే వాహనాలు పెరిగేలా చర్యలు తీసుకొని, వాటిని వాహనదారులు కొనుగోలు చేసేలా ప్రోత్సాహకాలు కల్పించాలని భారత రవాణా మంత్రిత్వ శాఖ సూచించింది.

తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసే వాహనాలకు గ్రీన్‌ప్లేట్‌ రిజస్ట్రేషన్‌ ఇవ్వాలన్నారు. విద్యుత్‌ అధారిత ప్రయాణికుల రవాణా వాహనాలకు పర్మిట్ అవసరం లేకుండా ఉండే విధివిధానాలను ఆగస్టు 31, 2019 కల్లా తయారుచేసి అచరణలో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం గడువు విధించింది. తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేసే వాహనాలకు ఇక నుంచి చేయనున్న గ్రీన్‌ప్లేట్‌ రిజిస్ట్రేషన్‌ వల్ల వాటికి అదనంగా ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. టోల్‌ ఛార్జీలు, పార్కింగ్‌ రుసుము ఉండదు. పార్కింగ్‌ ప్రదేశాల్లో వీటికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

ఈ తరహా వాహనాలకు అవసరమైన విద్యుత్‌ ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటునకు సన్నద్ధమౌతున్నారు. ఇప్పటికే మాల్స్‌, హౌసింగ్‌ సొసైటీలలో వీటిని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనిపై మహీంద్రా ఎలక్ట్రిక్‌ సీఈఓ మహేష్‌బాబు స్పందిస్తూ.. ‘విద్యుత్‌ వాహనాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హర్షణీయం. వీటికి ఇవ్వనున్న పన్ను మినహయింపులు వల్ల వాహనాదారులు త్వరగా విద్యుత్‌వాహనాల వైపు మరలే అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో కాలుష్యరహిత దేశాన్ని చూడగలం’ అని వ్యాఖ్యానించారు.

Related posts