telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ

కేన్సర్ రోగులకు శుభవార్త : ఔషదాల రేట్లు ..భారీగా తగ్గించిన ప్రభుత్వం…

govt reduced prices of cancer medicines

సామాన్యుడు కేన్సర్‌ చికిత్స చేయించుకోవాలంటే, ఆస్తులమ్ముకొని రోడ్డున పడాల్సిన పరిస్థితులున్నాయి. ముఖ్యంగా ఈ చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. వాటి కొనుగోలు సామాన్యుడికి తలకు మించిన భారంగా మారింది. కేన్సర్‌ రోగులున్న కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‌పీపీఏ) విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టింది. గత కొన్ని నెలలుగా కేన్సర్‌ ఔషధ ధరల తగ్గింపు దృష్టిపెట్టిన ఎన్‌పీపీఏ.. తాజాగా మరోసారి కేన్సర్‌ ధరలపై కొరడా ఝుళిపించింది.

దాదాపు రెండింతల నుంచి తొమ్మిదింతల వరకూ ఔషధ ధరలకు ముకుతాడు వేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు బుధవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువరించింది. ఈనెల ఒకటో నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. కేన్సర్‌ రోగులు ప్రైవేటులో అయితే ఔషధాలకే ఏటా రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పుడు జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల లక్షలాది మంది కేన్సర్‌ రోగులకు ఔషధ ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఎన్‌పీపీఏ తాజా సవరణలో ప్రధానంగా ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్‌ కేన్సర్లలో ఉపయోగించే ఔషధాల ధరలను తగ్గించింది.

Related posts