telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : .. ప్రతి మండలానికి .. ప్రభుత్వ జూనియర్ కాలేజీ ..

AP

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి మండలానికి ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రస్థుతం ఉన్న స్కూళ్లను క్రమపద్దతిలో కాలేజీలుగా మార్చేందుకు ఎలాంటీ చర్యలు తీసుకోవాలో నివేదిక తాయారు చేయాలని అధికారులు సూచించారు.నాడు-నేడు కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో 44,512 ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్లలో ఒకటవ తరగతి నుండి 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడీయం విద్యను ప్రవేశపెట్టనున్నట్టు సీఎం తెలిపారు.ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడీయం విద్యార్థులకు భోదినలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి ఏడాది జనవరిలోనే ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు.

ప్రభుత్వంలో ఏ శాఖలో ఉద్యోగాలు భర్తి చేయాలన్న జనవరిలోనే పరీక్షలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. రానున్న విద్యా సంవత్సరం నుండి పుస్తకాలు, యూనిఫారమ్స్‌, షూ, స్కూలు బ్యాగ్‌ వంటివన్ని పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే అందించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీల్లో సరైన మౌళిక సదుపాయాలు ఉన్నప్పుడు అనుమతులు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ కాలేజీల్లో పెద్ద ఎత్తున సౌకర్యాలు మెరుగుపరుస్తున్నందున ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో కూడ మౌలిక వసతులకు చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యా సంస్థలు కనీస వసతులు లేకుండా ఉండడం సరైన పద్దతి కాదని ఆయన చెప్పారు.

Related posts